Sonia Gandhi | రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి సోనియా గాంధీ!
Sonia Gandhi | తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) రేపు ప్రమాణ స్వీకారం(Swearing ceremony) చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగనుంది. గవర్నర్ తమిళిసై రేవంత్ రెడ్డితో ప్రమాణం చేయించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi) హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) రేపు ప్రమాణ స్వీకారం(Swearing ceremony) చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగనుంది. గవర్నర్ తమిళిసై రేవంత్ రెడ్డితో ప్రమాణం చేయించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi) హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
Congratulations to Telangana’s CM Designate, @revanth_anumula.
Under his leadership, the Congress govt will fulfill all its Guarantees to the people of Telangana and build a Prajala Sarkar. pic.twitter.com/ExfUlqY8Ic
— Rahul Gandhi (@RahulGandhi) December 6, 2023
ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంకాగాంధీ తదితర అగ్ర నేతలందరినీ ఆహ్వానించారు. ఈ క్రమంలో బుధవారం పార్లమెంట్‌కు వచ్చిన సోనియాను.. రేవంత్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తున్నారా అని ఓ విలేకరి అడగ్గా.. బహుశా వెళ్తానేమో అని సోనియా స్పందించారు. దాంతో సోనియాగాంధీ హైదరాబాద్ పర్యటనకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, అంతకు ముందు పలువురు ఏఐసీసీ నేతలు మల్లిఖార్జున్‌ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేసి ఉత్తమ పాలనను అందిస్తామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

