MP Santosh Kumar: ఉక్కు గుండెనొక్కసారన్న తాకాలని ఉన్నదే.. సీఎం కేసీఆర్‌పై కొత్త పాటను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్.. వీడియో
MP Santosh Kumar: సీఎం కేసీఆర్‌పై రూపొందించిన వీడియో సాంగ్‌ను ఎంపీ సంతోష్ రిలీజ్ చేశారు. ఆ పాటను ఆవిష్కరించడం థ్రిల్లింగ్‌గా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉక్కుగుండె నొక్కసారన్న తాకాలని ఉన్నదే పాటను మాట్ల తిరుపతి రాసి పాడారు. ఆ వీడియో సాంగ్‌ను తన సోషల్ మీడియా అకౌంట్లో ఎంపీ పోస్టు చేశారు.
హైదరాబాద్ : హైదరాబాద్ : “ఉకు గుండెను వొకసారన్నతాకాలనున్నదే” అనే పల్లవితో..ప్రముఖ పాటల రచయిత గాయకుడు, మాట్ల తిరుపతి రాసి సంగీతం సమకూర్చి పాడిన పాట.. ‘మన బాపు కేసీఆర్’ ఆడియో విజువల్ సీడీని బుధవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… నాడు అన్ని రంగాల్లో వివక్షకు, అవహేళనలకు గురైన తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి, ఉద్యమ ఆకాంక్షలను రగిలించి స్వరాష్ట్రాన్ని సాధించిన నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ చేసిన త్యాగాలగు గుర్తు చేసేలా వుందని అన్నారు. స్వయంపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపి నేడు తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని ఎవరెస్టు శిఖరమంత ఎత్తున నిలిచేలా చేసిన నేటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అచంచల పట్టుదలను తలుచుకుంటూ వారి ఔన్నత్యాన్ని చాటుతూ గాయకుడు మాట్ల తిరుపతి రాసిన పాట గుండెలకు హత్తుకునేలా వున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. మన బాపు కేసీఆర్ పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని కదలించేలా ఆలోచింపచేసేలా ఉందన్నారు. తన జీవితమంతా తెలంగాణ కోసమే అంకితం చేసి, ప్రజాఆకాంక్షలను నిజం చేస్తున్న సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువైవున్నాడని, అదే భావనను తన పాట రూపంలో వ్యక్తీకరించినందుకు అభినందించారు. ఈ పాటను సమర్పించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌ను, నిర్మాత ఎస్ రాఘవ, డైరక్టర్ పూర్ణను మంత్రి కేటీఆర్ అభినందించారు. కాగా, ‘మన బాపు కేసీఆర్’ పాటను అద్భుతంగా తీర్చిదిద్దిన మాట్ల తిరుపతిని మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ అభినందించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రిలీజైన కొత్త సాంగ్ కేక పుట్టిస్తోంది. ఉక్కు గుండెనొక్కసారన్న తాకాలని ఉన్నదే.. ఆ బక్కపల్చని పెయ్యిని హత్తుకోవాలని ఉన్నదే అన్న పాటను ఎంపీ సంతోష్ కుమార్ (MP Santosh Kumar) సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ సాంగ్ చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నట్లు ఎంపీ సంతోష్ తన సోషల్ మీడియా అకౌంట్లో తెలిపారు. ఆ పాటకు చెందిన వీడియోను కూడా ఆయన పోస్టు చేశారు. మనసుకు హత్తుకునే రీతిలో ఈ పాటను మాట్ల తిరుపతి రాశారని, ఈ సాంగ్ వింటే గూజ్బంప్స్ తప్పవని ఆయన అన్నారు. ఇది కేవలం మ్యూజిక్ మాత్రమే కాదు, ఇది వారసత్వ జర్నీ అని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో కామెంట్ చేశారు. ఆ మాస్టర్‌పీస్ పాటను మీరూ విని ఆనందించండి.
So thrilled to unveil a mesmerizing visual tribute to the legendary leader Sri KCR garu. Goosebumps are guaranteed as you immerse yourself in the soul-stirring lyrics penned, composed and sung by Matla Tirupathi garu. This song is not just music; it’s a journey through his… pic.twitter.com/OZ4k3Makgq
— Santosh Kumar J (@SantoshKumarBRS) October 18, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

