King Fisher | వరంగల్ : గతంలో బీర్లలో పాములు, ఇతర సూక్ష్మజీవులు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. దీంతో మందుబాబులు తీవ్ర ఆందోళనకు గురై.. ఎక్సైజ్ శాఖ అధికారులపై కన్నెర్రజేశారు. తాజాగా బీరు సీసాలో సోంపు ప్యాకెట్ ప్రత్యక్షమైంది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందులోని ఒక వైన్స్ షాపులో వెలుగు చూసింది.
ఓ వ్యక్తి కింగ్ ఫిషర్ బీరు కొనుగోలు చేశాడు. కాస్త ముందుకొచ్చి బీరు సీసాను నిశితంగా పరిశీలించి చూడగా, అందులో సోంపు ప్యాకెట్ కనిపించింది. దీంతో సదరు వ్యక్తి వైన్ షాపు యజమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతతో కూడిన బీర్లను విక్రయించాలని హెచ్చరించాడు. ఇలా అడ్డమైన చెత్త కలిగిన బీర్లను అమ్మడం సరైంది కాదని మండిపడ్డాడు.
కింగ్ ఫిషర్ బీరులో సోంపు ప్యాకెట్
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందులోని ఒక వైన్స్ షాపులో కింగ్ ఫిషర్ బీరులో ప్రత్యక్షమైన సోంపు ప్యాకెట్ pic.twitter.com/NaXcKPyo9F
— Telugu Scribe (@TeluguScribe) August 14, 2025