హైదరాబాద్, జూన్ 11(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది ఎన్డీయే కూటమి సర్కారేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జోస్యం చెప్పారు. టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని తెలిపారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తాజాగా జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఆయన ఈ వ్యా ఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కలిసి పోటీ చేస్తాయని సోమిరెడ్డి ముందస్తు సంకేతాలు ఇచ్చినట్టుగా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.