ఖైరతాబాద్, ఫిబ్రవరి 14 : నాలుగు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన భూములను కొందరు ఆక్రమించుకున్నారని ఐలాపూర్ రాజగోపాల్‌నగర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్ర ధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ, సందీప్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో సర్వే నంబర్లు 119 నుంచి 220 వరకు 408 ఎకరాల స్థలం ఉందని, 1984 నుంచి 1989 వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులు 3 వేల మందికి పైగా 200, 300, 500 గజాల చొప్పున కొనుగో లు చేసినట్టు తెలిపారు.
1994లో ఓ వ్యక్తి గ్రామస్తులను తీసుకొచ్చి ప్లాట్ల కబ్జాకు తెర లే పాడని, దీంతో కోర్టును ఆశ్రయించగా 1997 లో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినట్టు చెప్పారు. తిరిగి అప్పటి జాయింట్ కలెక్టర్‌పై ఒత్తిడిపెట్టి లావణి పట్టాగా చూపించే ప్రయ త్నం చేశాడని ఆరోపించారు. దీంతో మరోసారి కోర్టును ఆశ్రయించగా.. 2012లో ఆ ప్లాట్లన్నీ కొనుగోలు చేసి పట్టాలు పొందిన వారికే చెందుతాయని ఆర్డర్ వచ్చిందని చె ప్పారు. ఆ ఆర్డర్‌ను బేఖాతరు చేస్తూ మళ్లీ తమ ప్లాట్లను కబ్జా చేయడమే కాకుండా 20 21లో 700 ఇండ్లు నిర్మించి విక్రయించాడని, తమ ప్లాట్ల వద్దకు వెళ్తే రౌడీలను పెట్టి దాడు లు చేయించారని ఆరోపించారు. దీని వెనుక అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, ఓ మాజీ ఎమ్మెల్సీ అండదండలు ఉన్నట్టు ఆరోపించారు. కబ్జాదారుతో 3 వేల కుటుంబాలకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాలని కోరారు. సమావేశంలో రవికాంత్‌రెడ్డి, డాక్టర్ విష్ణువర్ధన్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
‘మా భూమిని కాజేయాలని చూస్తున్నరు’
ఖైరతాబాద్, ఫిబ్రవరి 14 : భూమి రాసివ్వనందుకు తమపై కొందరు కక్షగట్టి తప్పు డు కేసులతో జైలుపాలు చేశారని బాధిత రైతు దంపతులు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మం డలం తాటికల్లో ఆరు ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని తెలిపారు. పీడీఎస్ బియ్యం బ్లాక్‌మార్కెట్ దందా చేసే స్థానిక వ్యక్తి తమ భూమి నుంచి ఎకరం పట్టా చేయాలని వేధిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయమై సీఐకి తొమ్మిదిసార్లు, డీఎస్పీకి రెండుసార్లు, ఎస్పీకి పది, ఐజీకి ఒకసారి, డీజీపీకి నాలుగుసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. చివరకు జిల్లా మంత్రిని కలిసి అధికారుల్లో ఎలాంటి చలనం లేదన్నారు. తనకు జరిగిన అన్యాయంతోపాటు అధికారులు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 21న ఇందిపార్కు వద్ద ధర్నా చేస్తామని తెలిపారు.