Election Commission | అభ్యర్థి తన ఎన్నికల ఖర్చును అధికారులకు పారదర్శకంగా అందజేయా లి. ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేకుండా నామినేషన్ వేయడానికి కనీసం 24 గంటల ముందు ప్రారంభించిన నూతన బ్యాంకు ఖాతా నంబర్‌ను అందజేయాలి. బ్యాంకు పేరు, బ్రాంచి చిరునామా తదితర వివరాలు స్పష్టంగా తెలియజేయాలి.
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. పోటీ చేసే అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎమ్మెల్యేగా గెలుపొందిన కొందరిపై వారి ప్రత్యర్థులు నియమావళిని పాటించలేదని ఆరోపిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళిని విడుదల చేసింది. అభ్యర్థులు నామినేషన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందులో పొందుపరిచింది.
అభ్యర్థి.. ఈ నిబంధనలు తప్పనిసరి…
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతిపాదించే వ్యక్తులు లేకపోతే వారి నామినేషన్ తిరసరణకు గురవుతుంది. అలాగే ప్రతిపాదించే వ్యక్తులకు అభ్యర్థి పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఓటు హకు లేకపోయినా వారి ప్రతిపాదన చెల్లదు.