వేములవాడ టౌన్, మార్చి 15 : బ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మాజీ సభ్యురాలు, బీఆర్ఎస్ నాయకురాలు సంకేపల్లి సుమలతాసుధాకర్ శర్మ డిమాండ్ చేశారు.
ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మీడియాతో ఆమె మాట్లాడారు. ప్రజాప్రతినిధులు సమాజంలో ఐక్యతను పెంపొందించే విధంగా మాట్లాడాలని, సమాజంలో శాంతి, పరస్పర గౌరవం పెంచేలా ఉండాలని హితవుపలికారు. బ్రాహ్మణ సమాజంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సామెల్ వెంటనే వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు.