హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 29(నమస్తే తెలంగాణ ): గిగ్ వర్కర్స్‌ను ఆదుకుంటామని హామిచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు పట్టించుకోకపోవడం బాధాకరమని తెలంగాణ గిగ్ వర్కర్స్ యూనియన్ ఫౌండర్ షేక్ సలావుద్దీన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో 4.2లక్షల గిగ్ అండ్ ప్లాట్‌పాం వర్కర్స్ ఉన్నారని, వారి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ, మెటర్నిటీ, పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించి, న్యాయం చేయాలని కోరారు.