ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 12:33:31

ప్రచారంలో దూసుకెళ్తున్న సోలిపేట సుజాత

ప్రచారంలో దూసుకెళ్తున్న సోలిపేట సుజాత

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత దూసుకెళ్తున్నది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలను కలుస్తూ..ఆప్యాయంగా పలకరిస్తూ..అభివృద్ధిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నది. దుబ్బాక మండలంలోని చౌదర్‌పల్లి గ్రామంలో సుజాత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామస్తులు సుజాతకు ఘన స్వాగతం పలికారు. చౌదర్‌పల్లి గ్రామంతో దివంగత ఎమ్మెల్యే సోలిపేటకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

రామలింగన్నను కాపాడుకున్నది చౌదర్‌పల్లి గ్రామస్తులని, ఊరితో ఉన్న అనుబంధం వెలకట్టలేనిదన్నారు. నియోజకవర్గాన్ని మంరింత అభివృద్ధి చేసుకునేందుకు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించండని గ్రామస్తులను అభ్యర్థించారు. ప్రచారంలో జిల్లా పరిషత్ చైర్మన్ రోజాశర్మ శర్మ, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.logo