30న జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ
జ్యోతినగర్, జూలై 24: ఎన్టీపీసీ రిజర్వాయర్‌లో నిర్మించిన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను ఈ నెల 30న ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. రూ.423 కోట్లతో చేపట్టిన 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్‌ను ఇటీవలే ఉత్పత్తి దశనుంచి కమర్షియల్ ఆపరేషన్‌కు మళ్లించారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఢిల్లీ నుంచి ఆన్లైన్లో రిమోట్ ద్వారా జాతికి అంకితం చేయనున్నారని ఎన్టీపీసీ అధికారులు ఆదివారం తెలిపారు. లైవ్ టెలీకాస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని తిలకించేలా ఎన్టీపీసీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. కేరళలోని కాయంకుళంలో నిర్మించిన 92 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంటును కూడా ప్రధాని అదే రోజు జాతికి అంకితమివ్వనున్నారు.