హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉపఎన్నికల కోసం తరలిస్తూ ఇప్పటివరకు చిక్కిన సొమ్ము రూ.8 కోట్లకు చేరింది. మంగళవారం నామ్దేవ్ అనే వ్యక్తి నుంచి రూ.93 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ బీజేపీ నేతలకు చెందినవేనని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. నగదు తరలిస్తూ పట్టుబడిన వారిలో ఈటల పీఏ కారు డ్రైవర్ ఉండటం, దాదాపు అందరూ బీజేపీ నేతల సూచన మేరకే డబ్బు తరలిస్తున్నారని చెప్పడం ఓటర్లను ప్రలోభపెట్టేందుకేనని అంటున్నారు.