హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): మహిళల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రారంభించిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రత్యేక క్లినిక్స్ ద్వారా ఇప్పటివరకు 2,78,317 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనేక కారణాల వల్ల మహిళలలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారని, దీంతో వ్యాధి ముదిరి తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని సీఎం కేసీఆర్ గుర్తించారు. అందుకే ప్రాథమిక స్థాయిలోనే సమస్యను గుర్తించి చికిత్స అందించేలా ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ‘మహిళా క్లినిక్స్’ ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8 నుంచి 100 కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కరీంనగర్ కేంద్రంగా వీటిని ప్రారంభించారు.
‘ఆరోగ్య మహిళ’ పరీక్షలు ఇలా..
19