Sangareddy | సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 20 : చిన్న చికిత్సే కదా ఇలా వెళ్లి అలా వస్తానంటూ నవ్వుతూ దవాఖానకు వెళ్లిన వ్యక్తి శవమై వచ్చిన ఘటన అందరినీ కలిచివేసింది. బంధువుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గారకుర్తికి చెందిన వెల్టూరు శ్రీనివాస్(44) బుధవారం సంగారెడ్డిలోని పద్మావతి న్యూరో అండ్ ట్రామా కేర్ దవాఖానకు వెళ్లాడు.
గురక సమస్య ఉన్నదని చెప్పడంతో పరిశీలించిన వైద్యులు ముక్కులో బొక్క పెరిగిందని, సర్జరీ చేస్తే నయమవుతుందని చెప్పారు. సర్జరీ చేసిన వైద్యులు అదేరాత్రి 2 గంటల సమయంలో సదరు వ్యక్తికి గుండెపోటు వచ్చి మరణించాడని పేర్కొన్నారు. దీంతో బంధువులు, కుటుంబీకులు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.