నల్లగొండ సిటీ, మే 20 : మూడేండ్లలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కనగల్ మం డలం జీయడవల్లిలో రూ.కోటితో చేపట్టనున్న గ్రామ చెరువు మరమ్మతులను మంగళవారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
రూ.4వేల కోట్లతో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు చేపట్టామని తెలిపారు. కనగల్ దవాఖానలో గ్లకోమా కంటి పరీక్షలకు అధునాతన యంత్రం ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. మండల మహిళాసమాఖ్య సభ్యుల కోసం సోలార్ విద్యుత్తు యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.