స్కిల్ ఇండియా 2022 నివేదిక వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ): అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్న నగరాల జాబితాలో హైదరాబాద్ నగరం జాతీయంగా ఏడోస్థానంలో నిలిచింది. హైదరాబాద్ నగరంలో 53.55 శాతం యువత ఉద్యోగాలు దక్కించుకోవడంతో ఈ గౌరవం దక్కింది. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ -2022 ఈ సంగతి వెల్లడించింది. అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్న నగరాల్లో పుణె మొదటిస్థానంలో నిలువగా, లక్నో, త్రివేండ్రం, కోల్‌కతా, బెంగళూరు, న్యూఢిల్లీ నగరాలు వరుసగా తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఏఐసీటీఈ, యూఎన్డీపీ, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ సంయుక్తంగా ఇండియా స్కిల్స్ రిపోర్ట్‌ను విడుదల చేశాయి.
వేతనాల పరంగా తీసుకుంటే తెలంగాణలోని ఔత్సాహికులు 2 లక్షల నుంచి 2.26 లక్షలకు పైగా వార్షిక వేతనం తీసుకుంటున్నారు.అత్యధికంగా ఇంటర్న్‌షిప్ పొందుతున్నవారిలో తెలంగాణ 8వ స్థానంలో ఉన్నది. రాష్ట్రంలో 89.96 శాతం విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు.క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఉన్న టాప్‌టెన్ రాష్ర్టాల్లో తెలంగాణ 10వ స్థానంలో ఉన్నది.కంప్యూటర్ స్కిల్స్ కలిగిన యువత అత్యధికంగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ టాప్‌టెన్‌లో నిలిచింది.