నాగర్‌కర్నూలు: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్)లో టన్నెల్ కుప్పకూలిన ఘటనలో 8 మంది చిక్కున్న విషయం తెలిసిందే. ఆ కార్మికుల్ని రక్షించేందుకు ర్యాట్ మైనర్స్(Rat Miners) వచ్చేశారు. ఉత్తరకాశీలో సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మందిని రక్షించిన ఆ స్పెషలిస్టులు ఇప్పుడు ఎస్ఎల్బీసీకి చేరుకున్నారు. మొత్తం 12 మందిలో.. ఆరుగురు ఇప్పటికే చేరుకున్నారు. మరో ఆరుగురు ఇంకా ఢిల్లీ నుంచి రావాల్సి ఉన్నది.
నాగర్‌కర్నూలు చేరుకున్న ర్యాట్ మైనర్ ఫిరోజ్ ఖురేషి మీడియాతో మాట్లాడాడు. తాను తన టీంతో పాటు ఢిల్లీ నుంచి వచ్చినట్లు చెప్పాడు. కలెక్టర్ తమను పిలిపించినట్లు వెల్లడించాడు. ఆరు మంది ఇప్పటికే వచ్చేశామని, మరో ఆరుగురు వస్తున్నట్లు ఖురేషి తెలిపాడు. మొత్తం తమ బృందంలో 12 మంది ఉన్నట్లు పేర్కొన్నాడు. ఉత్తరాఖండ్‌లో 41 మందిని రక్షించినట్లు అతను తెలిపాడు.
అయితే శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్లో జరిగిన ప్రమాదం గురించి ఇంకా తమకు పూర్తి సమాచారం తెలియరాలేదని, ఎన్డీఆర్ఎఫ్.. ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఫాలో అవ్వాలని తమకు చెప్పారని, పరిస్థితిని ప్రత్యక్షంగా చూసే వరకు ఏం జరుగుతుందన్న విషయాన్ని చెప్పలేమన్నాడు.
#WATCH | Telangana: Rat miners who were part of the successful rescue operation for Uttarkashi tunnel collapse that happened on October 31st, arrived in Nagarkurnool for the ongoing rescue operation for Srisailam Left Bank Canal collapse
Firoz Qureshi, a rat miner, says, ” I… pic.twitter.com/fjbkhJbAin
— ANI (@ANI) February 24, 2025
ర్యాట్‌హోల్ టెక్నిక్‌లో ఒకే ఒక్క మనిషి పట్టేంత వెడల్పుతో సొరంగాన్ని తవ్వుతారు. సులభమైన పనిముట్లతో ఒకరు మట్టిని తవ్వుతుంటే, వెనుక ఉన్న వ్యక్తి ఆ మట్టిని బయటకు పంపిస్తారు. అలా పైకప్పు కూలకుండా చిన్నచిన్నగా సొరంగాన్ని తవ్వుతూ లోపలికి వెళ్తారు.