హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ఆరుగురు నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా పనిచేస్తున్న జే రంజన్ రతన్‌కుమార్‌ను సైబరాబాద్ కమిషనరేట్‌లోని మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీగా బదిలీ చేశారు. మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తున్న కే గుణశేఖర్‌ను వరంగల్ క్రైమ్స్ డీసీపీగా బదిలీ చేశారు.
ఇంటెలిజెన్స్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఏ ముత్యంరెడ్డిని సైబరాబాద్ కమిషనరేట్‌లోని క్రైమ్స్ అండ్ ఈవోడబ్ల్యూ కు బదిలీ చేశారు. సైబరాబాద్ ట్రాఫి క్ డీసీపీగా పనిచేస్తున్న కే ప్రసాద్‌ను హైదరాబాద్ కమిషనరేట్‌లోని పీసీఎస్అండ్ఎస్కు బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న సుంకరి శ్రీనివాస్‌ను హైదరాబాద్ ట్రాఫిక్-2 డీసీపీగా బదిలీ చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్-2లో డీసీపీగా ఉన్న ఎన్ అశోక్‌కుమార్‌ను హైడ్రా కొలాప్సల్ విభాగానికి బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని రవిగుప్తా తెలిపారు.
ఏసీబీలో అడిషనల్ ఎస్పీగా విధు లు నిర్వహిస్తున్న ఎస్ వీ నాగశివరామ్కు ఎస్పీ(నాన్‌క్యాడర్)గా పదోన్నతితోపాటు పోస్టింగ్ కల్పించారు. అతన్ని ఏసీబీలో జాయింట్ డైరెక్టర్‌గా నియమించారు.