హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్లకు పదోన్నతులు లభించాయి. ఈ ఆరుగురికి డీఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఐజీలుగా పదోన్నతులు పొందిన వారిలో అంబర్ కిషోర్ జా, రెమా రాజేశ్వరి, ఎల్ఎస్ చౌహాన్, నారాయణ నాయక్, పరిమళ నతన్, రంగారెడ్డిలు ఉన్నారు.