భద్రాద్రి కొత్తగూడెం, జూలై 19 (నమస్తే తెలంగాణ): సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ట్రయల్ రన్లో భాగంగా శుక్రవారం ఇంజినీరింగ్ అధికారులు రెండో మోటర్‌ను ఆన్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో ఉన్న ఏడు మోటర్లలో మొదటిసారిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ట్రయల్ చేయగా.. రెండో మోటర్‌ను ఇరిగేషన్ అధికారుల బృందం శు క్రవారం ట్రయల్ రన్ నిర్వహించింది. చైనా టెక్నాలజీతో తయారైన ఈ మోటర్ల పనితీరును అధికారులు పరిశీలించారు. ఆగస్టు కల్లా సాగునీరు అందించేలా అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు.