హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును శనివారం సిట్ అధికారులు 5 గంటలపాటు ప్రశ్నించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారణ కొనసాగింది.
మళ్లీ సోమవారం విచారణకు హాజరుకావాలని ఆయనను ఆదేశించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు కూడా సోమవారం సిట్ ఎదుట హాజరుకానున్నారు.