నయీంనగర్, ఆగస్టు 23: పేద కుటుంబానికి చెందిన విద్యాకుసుమం నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. హనుమకొండ హనుమాన్‌నగర్‌కు చెందిన జనగామ సురేశ్-కవిత దంపతుల కూతురు హరిప్రియ బుధవారం కన్వీనర్ కోటాలో భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు పొందింది.
గతంలో హరిప్రియ సోదరి శరణ్యప్రియ కూడా కన్వీనర్ కోటాలోనే కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించడం విశేషం. ఒకే కుటుంబంలో ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఎంబీబీఎస్ సీటు సాధించారు. వీరి తల్లిదండ్రులు హనుమాన్‌నగర్ డబ్బాల సెంటర్లో చిన్న దుకాణం నడుపుతున్నారు.