కొమురవెల్లి, జూన్ 28: ఇంటర్ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బొంగు కల్పన-తిరుపతిరెడ్డి కూతుళ్లు రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించారు. మల్లంపేట నారాయణ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పెద్ద కూతురు దివ్యారెడ్డి ఎంపీపీలో 1000 మార్కులకు 986 మార్కులు సాధించింది. చిన్న కూతురు నిత్యారెడ్డి సీఎంఎస్ ఫర్ సీఏ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 500 మార్కులకు 497 మార్కులు పొందింది. వ్యవసాయ కుటుంబంలో జన్మించి రాష్ట్రస్థాయిలో మంచి మార్కులు సాధించిన అక్కాచెల్లెను సర్పంచ్ కరుణాకర్ సత్కరించారు.