ఫిరాయింపుల ప్రభుత్వానికి చెంపపెట్టు: సిరికొండ
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు వెల్లడించిన తీర్పు గట్టి చెంపపెట్టని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వ్యాఖ్యానించారు. చట్టసభల హుందాతనాన్ని, రా జ్యాంగ నిబంధనలను, ప్రజాస్వామ్య విలువలను కా పాడేలా న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు అత్యంత అభినందనీయమని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేరొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు వెల్లడించిన తీర్పు గట్టి చెంపపెట్టని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వ్యాఖ్యానించారు. చట్టసభల హుందాతనాన్ని, రా జ్యాంగ నిబంధనలను, ప్రజాస్వామ్య విలువలను కా పాడేలా న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు అత్యంత అభినందనీయమని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేరొన్నారు. ఇతర పార్టీల నేతలు ఎవరైనా కాంగ్రెస్లోకి రావాలంటే పదవులకు రాజీనామా చేసిన తర్వాతే చేరాలని ఎన్నికలకు ముందు సీఎం రేవంత్రెడ్డి సన్నా యి నొకులు నొకారని గుర్తుచేశారు.
తీరా గద్దెనెకాక నైతిక విలువలను గాలికి వదిలేసి, స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ఆయన స్వయం వైరుధ్యానికి ప్రత్యక్ష నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారని ప్రస్తావించారు. అయినప్పటికీ సాంకేతికంగా తాను బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ దానం బుకాయించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు. చట్టసభల గౌరవాన్ని, ధర్మాన్ని నిలబెట్టడంలో స్పీకర్ విఫలమైన వేళ, అన్ని వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించిన హైకోర్టు న్యాయాన్ని రక్షించిందని స్పష్టం చేశారు. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలందరూ అనర్హత వేటుకు గురికావడం ఖాయమని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

