హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా కో-ఆపరేటీవ్ ఎలక్ట్రిక్ సైప్లె సొసైటీ లిమిటెడ్ ఎన్నికల వాయిదాకు ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఎన్నికను వాయిదా వేయాలని జిల్లా సహకార సంఘాల రిజిస్ట్రార్ కోరడాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాసర్రెడ్డితో కూడిన ధర్మాసనం తప్పుబట్టింది.
కోర్టు ఖర్చుల కింద రూ.50 వేలను రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని సహకార సంఘాల రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. సొసైటీ ఎన్నికల ప్రక్రియను నవంబర్ 1 నుంచి ప్రారంభించి డిసెంబర్‌లోగా పూర్తి చేస్తామని గతంలో హైకోర్టుకు తెలిపిన అధికారులు ఇప్పుడు గడువు కోరడాన్ని తప్పుబట్టింది.