Sintex | తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్న సింటెక్స్..!
Sintex | తెలంగాణలో మరో కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. సింటెక్స్ కంపెనీ రూ.350 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నది. వెల్ప్‌న్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా కొనసాగుతున్న సింటెక్స్ రూ.350 కోట్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పబోతున్నది.
Sintex | తెలంగాణలో మరో కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. సింటెక్స్ కంపెనీ రూ.350 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నది. వెల్ప్‌న్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా కొనసాగుతున్న సింటెక్స్ రూ.350 కోట్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పబోతున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. కంపెనీ పెట్టుబడితో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో సింటెక్స్ తయారీ యూనిట్ నెలకొల్పబోతుండగా.. ఇందులో సింటెక్స్ వాటర్ ట్యాంకులను, ప్లాస్టిక్ పైపులను, ఆటో కాంపోనెంట్స్ తదితర ఉత్పత్తులను తయారు చేయనున్నది.
ప్లాంట్ నిర్మాణానికి ఈ నెల 28న జరుగనుండగా ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్, వెల్స్పన్ కంపెనీ చైర్మన్ బీకే గొయెంకా పాల్గొనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి.. విజయవంతంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న వెల్స్పన్ గ్రూప్.. మరింత విస్తరిస్తుండడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వెల్ స్పన్ గ్రూప్ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ కంపెనీ రాష్ట్రంలో రూ.350 కోట్ల పెట్టుబడిగా పెట్టబోతున్నందుకు కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన మౌలిక వసతుల కారణంగా పెట్టుబడులు తరలివస్తున్నాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు.. మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
Happy to share that the popular Sintex brand is setting up a plant in Telangana
The Sintex unit will manufacture tanks, pipes, auto components and ancillaries with an investment of ₹350 Crores and generating employment to 1000 people
Will be breaking ground for the same on… pic.twitter.com/UrzAJX1ezi
— KTR (@KTRBRS) September 23, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | అన్నిటికీ హాలిడేలు ప్రకటించిన ఈ 420 సర్కార్కే హాలిడే ఇస్తే దరిద్రం పోతది.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
IND vs NZ | నేడు న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. సిరీస్‌ను క్లీన్‌స్వీస్ చేయడమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..!
KTR | తేలిపోతున్న కుట్రలు.. దారికొస్తున్న కుట్రదారులు.. మొన్న ఈనాడు.. నేడు సురేఖ క్షమాపణలు
Konda Surekha | కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా… కొండా సురేఖ క్షమాపణ
Revanth Reddy | కరువులో రాష్ట్రం.. విందుల్లో సీఎం.. గ్లోబల్ సమ్మిట్ పేరిట ఫైవ్‌స్టార్ హోటళ్లలో విందులు, వినోదాలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

