Allu Arjun | ఖైరతాబాద్, డిసెంబర్ 14 : అల్లు అర్జున్ అరెస్టు వెనుక కుట్ర కోణం దాగున్నదని గాయని కల్పనా రాఘవేంద్ర అనుమానం వ్యక్తంచేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆమె మాట్లాడారు. అల్లు అర్జున్ తెలుగు రాష్ర్టాల్లోనే కాదు, దేశంలో ఒక ఐకానిక్ స్టార్లా ఉన్నారని తెలిపారు. అలాంటి వ్యక్తిని బెడ్రూమ్లోకి వెళ్లి అరెస్టు చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
సినిమా పెట్టుబడి వ్యాపారమని, లాభాల కోసమే సిని మా తీస్తారని, డబ్బు ల కోసమే నటిస్తారంటూ సీఎం రేవం త్ చేసిన వ్యాఖ్యల ను తప్పుబట్టారు. పుష్ప-2 చిత్రం వెయ్యి కోట్ల లాభాలను ఆర్జించిందని, అందులో 18 శాతం జీఎస్టీ ప్రభుత్వానికి చేరుతుందని సీఎంకు తెలియదా అని ఆమె ప్రశ్నించారు. మహిళ మృతి వెనుక హత్య లాంటి కుట్ర కోణం దాగి ఉండొచ్చని, విచారణ చేపట్టాలన్నారు.