Singareni | ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వంపై సింగరేణి కార్మికలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సింగరేణిలోని బొగ్గు బ్లాకులను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించడంపై మండిపడుతున్నది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా మహాధర్నా చేపట్టారు. రామగుండం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెంలో మహాధర్నాలు చేపట్టారు. శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్లపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లిలో చేపట్టిన ధర్నాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ పాల్గొననున్నారు. కొత్తగూడెంలో మంత్రి పువ్వాడ, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు సింగరేణి ధర్నాలో పాల్గొని నిరసనలు తెలిపుతారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తా దగ్గర నిర్వహించిన మహాధర్నాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొననున్నారు.