Singareni | సింగరేణి ఎన్నికలు.. మ.12 గంటల వరకు 23,623 ఓట్లు పోలింగ్
Singareni | సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 11 డివిజన్లలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సింగరేణి కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Singareni | సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 11 డివిజన్లలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 23,623 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 39,775 ఓట్లు ఉన్నాయి.
ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో ఉన్నాయి. సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 700 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు.
ఇక పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి, పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తామని సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

