హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : సింగరేణిని కాగితరహిత సంస్థగా రూపొందించాలని సంస్థ డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్, ఎన్ బలరాం అధికారులకు ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి కనీసం ఒక ఏరియాను ఈ-ఆఫీస్‌గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
బుధవారం ఈఆఫీస్పై హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి సంస్థ డైరెక్టర్లు.. ఉన్నతాధికారులతో సమీక్షించారు. సింగరేణి సంస్థ ఇప్పటికే ఐటీ వినియోగంలో కోలిండియాకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. సింగరేణి సేవాసమితి, సింగరేణి పబ్లిక్ రిలేషన్స్ శాఖలకు ప్రత్యేక వెబ్‌పోర్టళ్లను రూపొందించిన ఐటీ విభాగం జీఎం ఎం సురేశ్‌ను సంస్థ డైరెక్టర్లు అభినందించారు. సమావేశంలో సంస్థ ఉన్నతాధికారులు రామ్‌కుమార్, సీహెచ్ నర్సింహారావు, రవిప్రసాద్, సుధాకర్, హరిప్రసాద్, షర్మిల మోజెస్ తదితరులు పాల్గొన్నారు.