KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
KTR | కరువులో రాష్ట్రం ఉంటే సుందరీకరణ పేరుతో డ్రామాలు మీరే చెప్తున్నారు.. కరువు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఊళ్లల్లో నాటకాలు వేయాలంట.. జానపదాలు పాడాలంట.. . ఇక్కడ మాత్రం మూసీలో లక్షన్నర కోట్ల లూటీకి ముఖ్యమంత్రి తెరలేపారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | తెల్లారి లేస్తే రాజ్యాంగాన్ని పట్టుకొని పోజులు కొట్టే రాహుల్ గాంధీ మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు సోయి లేదా.. పబ్లిక్ హియరింగ్ అని చెప్పి.. పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కరువులో రాష్ట్రం ఉంటే సుందరీకరణ పేరుతో డ్రామాలు మీరే చెప్తున్నారు.. కరువు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఊళ్లల్లో నాటకాలు వేయాలంట.. జానపదాలు పాడాలంట.. పద్యాలు పాడాలట.. డ్రామాలు చేయాలట. ఇక్కడ మాత్రం మూసీలో లక్షన్నర కోట్ల లూటీకి ముఖ్యమంత్రి తెరలేపారని అన్నారు.
ఆయనకు రియల్ ఎస్టేట్ తప్ప ఏం తెలియదని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు.. రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అని అంటరు.. అని అంటరని కేటీఆర్ గుర్తు చేశారు. ఇవాళ అధికారుల నుంచి మాకు అందుతున్న సమాచారం ప్రకారం మూసీ ప్రాజెక్టు ముసుగులో వేలాది ఎకరాల లూటీకి ఈ ముఖ్యమంత్రి తెరలేపారు.. అందుకే పబ్లిక్ హియరింగ్ అంటే ఉలిక్కి పడుతున్నరు.. అందుకే పబ్లిక్ హియరింగ్ అంటే ఉలిక్కి పడుతున్నరు.. భయపడుతున్నరు.. పబ్లిక్ రాకుండా తూతూ మంత్రంగా ఏదో చేశామంటే చేశామనిపించుకోవడానికి ఒక ప్రొసీజరల్ ఇష్యూలాగా చాప కింద తోసేసే ప్రయత్నం చేస్తున్నారు..
దీన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు.. ఒక వైపు కరువులో రాష్ట్రం ఉంటే అన్నదాతలు అల్లాడుతుంటే ఎండిన పంటలతో ఇవాళ పశుగ్రాసం లేక చివరికి పశువులు అల్లాడిపోతుంటే, నీళ్లు లేక హైదరాబాద్ ప్రజలు మొత్తుకుంటుంటే 10 టీఎంసీల నీళ్లు మల్లన్నసాగర్లో నుంచి తీసుకొచ్చి మూసీలో పోస్తడట.. ఎవడన్నా బుద్దున్న ముఖ్యమంత్రి ఇట్లా పని చేస్తడా..? అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
సాగునీటికి దిక్కులేదు.. తాగునీటికి దిక్కులేదు.. కానీ 10 టీఎంసీల నీటిని తీసుకొచ్చిమూసీలో పోసి సుందరీకరిస్తడట.. మింగమెతుకు లేదు కానీ.. మీసాలకు సంపెంగ నూనె అని యెనకటికి ఒక సామెత ఉండేది.. అట్లా ఉంది ముఖ్యమంత్రి ఆలోచనా విధానం.. ఈ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి మా నెత్తిమీద రుద్దిన రాహుల్ గాంధీని అడుగుతున్నా.. మీవి ఏ రకమైన ప్రాధాన్యాలని కేటీఆర్ అడిగారు.
LIVE : KTR Press Meet at Telangana Bhavan https://t.co/jF4NdnVBXn
— Telugu Scribe (@TeluguScribe) October 29, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
Culinary Medicine | ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతున్న క్యులినరీ మెడిసిన్.. అసలేమిటి.. ఏం చేస్తుంది..?
Electric Shock | దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం..భార్యభర్తలు మృతి
Balmuri Vidyasagar Rao | రాజకీయ ఒత్తిళ్ల ద్వారా నా భూమి కబ్జాకు ప్రయత్నం : కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పెద్దనాన్న
Dimagi Naxals: దిమాగీ నక్సల్స్ అంటే తెలియదు.. సమాచారం లేదు: కేంద్రం హోంశాఖ
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

