సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 18 : క్షుద్రపూజల కేసులో రికవరీ సొమ్మును బాధితుడికి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిన సీసీసీ నస్పూర్ ఎస్ఐ నెల్కి సుగుణాకర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. క్షుద్రపూజలు చేసి కోట్లలో డబ్బులు కురిపిస్తామని మంచిర్యాలకు చెందిన రంజిత్, బాలకృష్ణ.. అదే ప్రాంతానికి చెందిన మాదంశెట్టి ప్రభంజన్‌ను నమ్మించారు. ప్రభంజన్ జనవరి 24న నస్పూర్‌లోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఐత సత్యనారాయణ ఇంటికి రూ.2 లక్షలు ఇచ్చా డు. మహారాష్ట్రకు చెందిన పూజారి శీత ల్ దత్తాత్రేయ కొరివి జాదవ్ , నస్పూర్ సీతారాంపల్లికి చెం దిన కిషన్, ప్రభాకర్, జగిత్యాలకు చెందిన ప్రశాంతి క్షుద్రపూజలు ప్రారంభించారు. వీరిపై అనుమానం వచ్చిన ప్రభంజన్ 25న సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ముఠాలోని సభ్యులందరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.