TSLPRB | హైదరాబాద్ : రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల( Police Jobs ) భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎస్ఐ( SI ), ఏఎస్ఐ( ASI ) ఉద్యోగాలకు సంబంధించిన తుది రాతపరీక్షల తేదీలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు( TSLPRB ) ఖరారు చేసింది. ఏప్రిల్ 8, 9వ తేదీల్లో ఈ రాతపరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది.
ఎస్సీటీ ఎస్ఐ( SCT SI ), ఏఎస్ఐ పోస్టులకు 8వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఎస్సీటీ ఎస్ఐ(సివిల్)( SCT SI Civil ) పోస్టులకు 9వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జనరల్ స్టడీస్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ పేపర్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 6వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.