హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. ఈ మేరకు కేంద్ర అంతర్గత వ్యవహారాల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. క్యాబినెట్ సెక్రటేరియట్లో డిప్యూటీ సెక్రటరీగా నియమించింది.
ఆమె 4 ఏండ్లు కేంద్ర సర్వీసుల్లో కొనసాగనున్నారు. 2011 బ్యాచ్‌కు చెందిన శ్వేతామహంతి వనపర్తి, హైదరాబాద్ తదితర జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. తర్వాత ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. తిరిగి వచ్చి కుటుంబ సంక్షేమకమిషనర్గా బాధ్యతలు చేపట్టారు.