కొడుకు ఎదుటే తల్లిపై లైంగికదాడి.. మద్యం మత్తులో ఇద్దరి దుర్మార్గం
నారాయణపేట జిల్లా మక్తల్‌లో దారుణం చోటుచేసుకున్నది. ఒంటరిగా నిద్రిస్తున్న మహిళపై ఆమె కన్నకొడుకు ఎదుటే మద్యం మత్తులో ఉన్న ఇద్దరు దుండగులు లైంగికదాడికి పాల్పడ్డారు. అడ్డుకొనేందుకు యత్నించిన ఆ బాలుడిపైనా దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగని ఆ దుర్మార్గులు బాధిత మహిళ రహస్యాంగాలు కోసి రాక్షసంగా ప్రవర్తించారు.
- అడ్డుకోబోయిన బాలుడిపై దాడి
- మక్తల్‌లో మహిళ ప్రైవేట్‌పార్ట్స్ కోసి పరారైన దుండగులు
- తీవ్రరక్తస్రావం కావడంతో దవాఖానకు తరలింపు
- దోషులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తుల డిమాండ్
- నిందితుల కోసం పోలీసుల గాలింపు
మక్తల్, ఆగస్టు 27 : నారాయణపేట జిల్లా మక్తల్‌లో దారుణం చోటుచేసుకున్నది. ఒంటరిగా నిద్రిస్తున్న మహిళపై ఆమె కన్నకొడుకు ఎదుటే మద్యం మత్తులో ఉన్న ఇద్దరు దుండగులు లైంగికదాడికి పాల్పడ్డారు. అడ్డుకొనేందుకు యత్నించిన ఆ బాలుడిపైనా దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగని ఆ దుర్మార్గులు బాధిత మహిళ రహస్యాంగాలు కోసి రాక్షసంగా ప్రవర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మక్తల్ పట్టణంలో ఓ మహిళ పదేండ్లుగా తన 12 ఏండ్ల కొడుకుతో కలిసి ఉంటున్నది. జీవనోపాధి కోసం యాచకురాలిగా ప్రధాన కూడలితోపాటు బస్ స్టాండ్ వద్ద తిరుగుతుండేది. రాత్రి సమయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో తలదాచుకుంటున్నది. గురువారం కూడా అదే భవనంలో తలదాచుకున్నది.
తెల్లవారుజామున మద్యం మత్తులో ఉన్న గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కళాశాల భవనం వద్దకు వెళ్లారు. నిద్రపోతున్న మహిళపై లైంగికదాడికి యత్నించారు. ఆమె కేకలు వేయడంతో నిద్ర నుంచి కుమారుడు లేచి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అతడిపై ఆ ఇద్దరూ దాడి చేయడంతో భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత మహిళపై విచక్షణారహితంగా ఇద్దరు దుండగులు లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం మహిళ రహస్యాంగాలను కట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న మహిళను.. ఉదయం కాలేజీ గ్రౌండ్లోకి వాకింగ్‌కు వచ్చిన స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మహిళను చికిత్స నిమిత్తం మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలించి, నిందితులను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

