హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర, జిల్లా పోలీసు ఫిర్యాదుల సంస్థ చైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్‌రావు సహా సభ్యులను నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ పోలీసు కైంప్లెంట్ అథారిటీకి చైర్మన్ సహా సభ్యులను నియమించారు. సభ్యులుగా రిటైర్డ్ ఐపీఎస్ పీ ప్రమోద్‌కుమార్, న్యాయవాది వర్రె వెంకటేశ్వర్లు, సభ్య కార్యదర్శిగా శాంతిభద్రతల అదనపు డీజీని నియమించారు.
జిల్లాస్థాయిలో హైదరాబాద్ రేంజ్‌కు చైర్‌పర్సన్‌గా జిల్లా రిటైర్డ్ జడ్జి కే సుదర్శన్, సభ్యులుగా మాజీ జర్నలిస్టు పీ రామ్మోహన్, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రామనర్సింహ, సభ్య సెక్రటరీగా మల్టీజోన్-2 ఐజీని నియమించారు. వరంగల్ రేంజ్లో చైర్‌పర్సన్‌గా జిల్లా రిటైర్డ్ జడ్జి వై అరవింద్‌రెడ్డి, సభ్యులుగా రిటైర్డ్ ఎస్పీ ఎం నారాయణ, సామల రాజేందర్, సభ్య సెక్రటరీగా మల్టీజోన్-1 ఐజీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.