హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళలపై లైంగికదాడులు పెరిగిపోయాయని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభ్యులకు ప్రత్యేక అంశాలపై మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీలో మహిళలపై దాడులపై చర్చ జరిగిన 24 గంటల్లోనే నగరంలో మూడు ఘటనలు జరుగడం దురదృష్టకరమన్నారు. మహిళల మీద దాడులు జరుగుతున్నా ప్రభుత్వం, మంత్రుల నుంచి ఎలాంటి స్పందనలేదని ఆవేదన వ్యక్తంచేశా రు. రాష్ట్రంలో హోంమంత్రి లేడని, ఆ శాఖ సీఎం దగ్గర ఉన్నందున శాంతిభద్రతలపై పకడ్బందీ చర్యలు తీ సుకోవాలని సూ చించారు.
లైంగికదాడుల దోషులను కఠినంగా శిక్షించాల ని డిమాండ్ చేశా రు. అనంతరం ఉ పాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, బీఆర్ఎస్ సభ్యులు డాక్టర్ యాదవరెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, వాణీదేవి, తాతా మధు, రవీందర్రావు, యెగ్గే మల్లేశం, ఎల్ రమణ, నవీన్‌రెడ్డి, మహమూద్ అలీ, బీజేపీ సభ్యుడు ఏవీఎన్‌రెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి, ఎం ఐఎం సభ్యుడు బేగ్ కొన్ని అంశాలను సభలో ప్రస్తావించగా మంత్రి తుమ్మల నోట్ చేసుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి న ర్సిరెడ్డి, బీఆర్ఎస్ సభ్యులు శేరి సుభాష్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు పిటిషన్‌ను ఇచ్చా రు. టీ విరామం కోసం వాయిదా పడిన సభ తిరిగి మధ్యాహ్నం ప్రారంభం కాగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది.