వెల్దుర్తి, జూలై 31: కన్నతల్లిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ అమానవీయ ఘటన మెదక్ జిల్లా మాసాయిపేటలో జూలై 29న జరిగింది. గ్రామానికి చెందిన 35 ఏండ్ల వ్యక్తికి భార్య, పిల్లలున్నారు. అయితే.. వారు గత సోమవారం బంధువుల ఇంటికి వెళ్లారు.
మద్యం తాగొచ్చిన ఆ వ్యక్తి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తల్లి (56)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర మనోవేదనకు గురైన తల్లి బుధవారం చేగుంట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ జరిపి కేసు నమోదు చేసినట్టు తెలిపారు.