హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఇంజినీర్ అలీ నవాబ్‌జంగ్ బహదూర్ సేవలు ఎనలేనివని పలువురు వక్తలు కొనియాడారు. హైదరాబాద్‌లోని జలసౌధలో నవాబ్‌జంగ్ 77వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఏటా డిసెంబర్ 6న నవాజ్‌జంగ్ వర్ధంతిని తెలంగాణ ఇంజినీర్ల స్మారక దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఏడాది కాలంలో మృతిచెందిన ఇంజినీర్ల చిత్రపటాల ఎదుట కొవొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్, డిప్యూటీ ఈఎన్సీ చందర్రావు, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశం, వరింగ్ ప్రెసిడెంట్ రాంరెడ్డి, సీనియర్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.