(లోహా నుంచి నమస్తే తెలంగాణ బృందం);మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకూ పుంజుకొంటున్నది. గులాబీ పార్టీలో చేరికల జోరు కొనసాగుతున్నది. ఎన్సీపీ, శివసేన, బీజేపీ తదితర పార్టీల నుంచి నేతలు బీఆర్ఎస్లోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో పార్టీలో చేరారు. తాజాగా లోహా పట్టణ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభా వేదికగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, గ్రామస్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. మహారాష్ట్ర షెత్కారీ సంఘటన్ నాయకుడు, ఎన్సీపీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే ఆ పార్టీకి రాజీనామా చేసి, బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన నాయకత్వంలో వందలాదిమంది కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు. మాజీ ఎంపీ హరిబావు రాథోడ్, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వసంతరావు బోండేతోపాటు గత ఎన్నికల్లో పలు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన నేతలకు సభా వేదికపై కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన ముఖ్య నాయకుల్లో సురేశ్ గైక్వాడ్, యశ్పాల్ బింగే, జాకీర్ చావోస్, నాగ్నాథ్ బిస్సేవాడే, దిలీప్ దోండ్గే, శివరాజ్ దోండ్గే, బంజరా సమాజ్ బడే నేత బాహుసాబ్, ప్రవీణ్ జితేవాడే, పీఎస్ గవాలే, గంగాధర్ పాటిల్, సవితా వార్కడ్ విఠల్ నాయక్ తదితరులు ఉన్నారు.
Kcr
బీఆర్ఎస్లో చేరిన నేతలు వీరే..
బీఆర్ఎస్లో చేరిన నాయకుల్లో పలువురు సర్పంచులు, జడ్పీటీసీలు, యువజన సంఘా ల నేతలు, రైతు సంఘాల నాయకులు ఉన్నా రు. పార్టీలో చేరినవారిలో దత్త కుమార్, శివదాస్ కేశవ్‌రావు, ప్రతాప్, లక్ష్మణ్ బాంగేజీ, మనీశ్బావేరావు, రోషన్ సింగ్రాజేవాలే, భీమారావు పవార్, వెంకటరావు గైక్వాడ్, ప్రభాకర్, అశీష్ గట్టా, మహేంద్రదేశ్ ముం డేజీ, మహమూద్ అజారొద్దీన్, సునీల్, ఉత్తమరావు పాటిల్, భగవాన్ షిండే, సుభాష్ మోరె, సంజయ్ పాటిల్, కొండప్ప స్వామి, ప్రభాకర్ పాటిల్, వెంకటేశ్ మషిద్కర్, బోషేకర్ మనోహర్ విశ్వనాథ్‌రావు, దోంగ్డే సునీల్ బాలాజీరా వు, కన్హాలే సంజయ్ భీంరావు, ప్రహ్లాద్ హన్మంతరావు, దోంగ్డే విజయ్‌కుమార్ బాలాజీరావు, తాటే ఫులాజీ నారాయణ్, స్వామి ఛత్రపతి కొండప్ప, మీర్జా షఫియుల్లా బేగ్, మీర్జా ము గ్దుం బేగ్, గైక్వాడ్, సుభాష్ విఠల్‌రావు, విశ్వాస్‌రావు శివదాస్ గంగాధర్‌రావు, షిండే సచిన్ వెంకటరావు, వాడిగే దిగంబర్ శ్యాంరావు, కేకాటే రాజ్‌కుమార్ కిషన్‌రావు, తెంలగ్ ఉద్దవ్ మాధవ్, రహేర్కర్ సుభాష్ పండిత్రావు, జో షి ప్రణీతా శరత్, ఫూలే బాబా శేష్‌రావు, ఆనందరావు గంగారాం, ప్రభాకర్ గోపాల్‌రావు, కొండ్గిరే సూర్యకాంత్, మోరె సుభాశ్దత్తారా వ్, సంగీత విజయ్‌కుమార్ దోంగ్డే, బలిరాం శం భాజీ, కోర్డే దిగంబర్ నారాయణ్, కాడ్గే ఫాజ్గే సాయినాథ్ ప్రహ్లాద్ ఉన్నారు. చంద్రపూర్ జిల్లా నుంచి సంతోష్, నరేంద్ర మడావ, పుష్పక్ పవార్, జడ్పీటీసీ సంతోష్ కర్బకర్, జోగేష్ మడావి, సందీప్ మడావి, సతీశ్, మయూర్ కాంక్డే, శంకర్ మడావి, ప్రతీశ్ దూబే, రవి చాచ, దీపక్ మిశ్రా, సంతోష్ టక్కర్తోపాటు 200 మంది ప్రముఖ నాయకులు వందల మంది అనుచరులతో బీఆర్ఎస్లో చేరారు.
Cm Kcr
దేశంలో రైతులే ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలె?
రైతులు అందరూ ఆలోచించాలె. ప్రధాని మోదీ రూ.15 లక్షల కోట్లు పెట్టుబడిదారులకు దోచిపెట్టారు. దేశంలో ఒక్క కార్పొరేట్ ఆత్మహత్య చేసుకోలేదు. మరి రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? కేసీఆర్ పాలనలో తెలంగాణలో వ్యవసాయం పండగలా మారింది. తెలంగాణలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడం లేదు. అక్కడ ఎకరాకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు.
– గుర్నామ్‌సింగ్ చడూనీ, బీఆర్ఎస్ కిసాన్ సెల్ జాతీయ అధ్యక్షుడు
రైతులకు మరో దేవుడు కేసీఆర్
నేను 50 ఏండ్లుగా రైతు ఉద్యమాల్లో పాలుపంచుకున్నా.. వారి కంట కన్నీరు తుడవలేకపోయాను. ఇప్పటికీ మరాఠ్వాడ, విదర్భలో రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి. అతి స్వల్ప కాలంలోనే తెలంగాణ రూపురేఖలను మార్చిన గొప్ప నాయకుడు కేసీఆర్. రైతుల సమస్యల పరిష్కారానికి వచ్చిన మరో దేవుడే కేసీఆర్. ఆయనతో కలిసి నడవడంతో నా జన్మ ధన్యమైంది. కేసీఆర్ నేతృత్వంలో మహారాష్ట్ర రైతులు ఐక్యంగా పోరాడాలి.
– శంకరన్న దోండ్గే, కంధార్ మాజీ ఎమ్మెల్యే, రైతు ఉద్యమనేత
అంబేద్కర్ ఆశయాల బాటలో కేసీఆర్
మహారాష్ట్రలో అన్ని వనరులు ఉన్నాయి. సంపద ఉన్నది. ఇక్కడి ప్రభుత్వాలు కనీస వసతులను కల్పించడం లేదు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలు దేశానికే దిక్సూచిగా ఉన్నాయి. అంబేద్కర్, ఫూలే మహనీయుల స్ఫూర్తిని చాటుతున్నారు. మహారాష్ట్ర రైతులు, నిరుపేదలందరూ కేసీఆర్ పిలుపును అందుకోవాలి. బీఆర్ఎస్ను బలోపేతం చేయాలి. అప్పుడే బంగారు భవిష్యత్తు, అభివృద్ధి సాధ్యమవుతుంది.
– సురేశ్ దాదా గైక్వాడ్, దళిత నాయకుడు, మాజీ ఎమ్మెల్యే
కేసీఆర్‌తోనే రైతుల సంక్షేమం
రైతుల హక్కుల కోసం తుదిశ్వాస వరకు పోరాడిన శరద్‌జోషి స్వ ప్నాలను తెలంగాణ సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, ధాన్యం కొనుగోలు కేం ద్రాల ఏర్పాటు, కల్యాణలక్ష్మి లాంటి అనేక పథకాలను అమలు చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తూ నీళ్లను ఇస్తున్నారు. వ్యవసాయాన్ని పండుగ చేశారు. ఆయన నాయకత్వంలో రైతులంతా ఐక్యం కావాలి. బీఆర్ఎస్ను అక్కున చేర్చుకోవాలి.
– మాణిక్‌రావు కదం, బీఆర్ఎస్ కిసాన్ సెల్ మహారాష్ట్ర అధ్యక్షుడు
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం
కాంగ్రెస్, బీజేపీ పాలనలో రైతులు, పేదల బతుకులు మారలేదు. మరఠ్వాడ, విదర్భలో నిత్యం ఎవరో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న సమాచారాన్ని చదువుతున్నాం. ఇకపై అలాంటి సంఘటనలకు తావివ్వకూడదు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కోసం పనిచేద్దాం. అక్కడ అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను మహారాష్ట్రలో అమలు చేసుకుందాం. రైతులు ఐక్యతను చాటాలి.
–హరిబావు రాథోడ్, మాజీ ఎంపీ
కేసీఆర్ సభతో బీజేపీకి వణుకు
ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్‌లో నిర్వహించిన సభతో బీజేపీ ప్రభుత్వానికి వణుకు పుట్టింది. అందుకే ఇప్పుడు రైతులను మభ్యపెట్టడానికి ఎకరాకు రూ.6 వేల ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది. ఇన్నేండ్లుగా లేని ప్రేమను ఇప్పుడు రైతులపై ఒలకబోస్తున్నది. ఇది ఆరంభమే. మున్ముందు మరింత చైతన్యంతో, ఐక్యతతో రైతులు పోరుబాట పట్టాలి. గులాబీ జెండాను అందుకోవాలి. బీఆర్ఎస్ను పటిష్ట పరచాలి. తెలంగాణ మాడల్ కావాలని నినదించాలి.
– హర్షవర్ధన్ జాదవ్, కన్నాడ్ మాజీ ఎమ్మెల్యే