హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకూ దేశంలోని అన్నివర్గాల మద్దతు పెరుగుతున్నది. రైతురాజ్యాన్ని ఆవిషరించటమే లక్ష్యంగా సాగుతున్న బీఆర్ఎస్ పార్టీ అబ్ కీ బార్ కిసాన్ సరార్’ ఉద్యమంలోకి రైతులతోపాటు, దేశం కోసం పోరాడిన మాజీ సైనికులు మేము సైతం అంటూ కదం కలిపారు. నాడు దేశ రక్షణ కోసం పని చేసిన విశ్రాంత సైనికులు బీఆర్ఎస్ వేదికగా రైతులతో కలిసి పనిచేసేందుకు పెద్దసంఖ్యలో ముందుకొస్తున్నారు. రైతు బిడ్డలుగా తమ వంతు కృషి చేస్తామని మాజీ సైనికులు ముందడుగు వేస్తున్నారు.
ఈ ముందడుగు మహారాష్ట్రతోనే కావటం గమనార్హం. దేశంలో కిసాన్రాజ్య స్థాపనకోసం బీఆర్ఎస్ సైనికులమై పోరా టం సాగిస్తామని స్పష్టంచేశారు. పలువురు మాజీ సైనికులు బుధవారం పుణెలో బీఆర్ఎస్ పార్టీలో చేర డం ప్రాధాన్యం సంతరించుకున్నది. మహారాష్ట్ర వేదికగా బీఆర్ఎస్లోకి రోజూ పెద్దసంఖ్యలో చేరికలు జరుగుతున్నాయి. బుధవారం పుణెలోని అంబేదర్ కల్చరల్ భవన్లో మాజీ సైనికులు, మాజీ సైనికాధికారులతో కూడిన వేర్వేరు సంఘాలకు చెందిన 203 మంది సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ నేత శంకరన్న దోండ్గే నేతృత్వంలో వీరంతా గులాబీ కండువాలు కప్పుకున్నారు.
ఉజ్వల భారత్ లక్ష్యసాధనకై ఉద్యమించిన బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తున్న రైతాంగానికి తోడుగా తామూ నిలుస్తామని ఈ సందర్భంగా మాజీ సైనికులు, మాజీ సైనికాధికారులు తీర్మానం చేశారు. ‘రైతులకు తోడుగా సైనికులు’ అంటూ నినదిస్తూ, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17 లక్షల మంది మాజీ సైనికులున్నట్టు అంచనా. వీరందరూ బీఆర్ఎస్లో చేరనున్నట్టు సమాచారం. రైతు బిడ్డలుగా తమ కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిన సందర్భం వచ్చిందని వారు భావిస్తున్నట్టు సమాచారం. తద్వారా… దేశ సమగ్రత, ఐక్యత, అభివృద్ధి కోసం నాటి పాలకులు ఇచ్చిన ‘జై జవాన్ జై కిసాన్’ అనే నినాదానికి నిజమైన అర్థం నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంతరించుకున్నది.