హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): 104 సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులకు వెంటనే ఏడునెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని ప్రభుత్వ ఫార్మసీ ఆఫీసర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్‌గౌడ్ డిమాండ్‌చేశారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఫార్మసీ ఆఫీసర్లకు వెంటనే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయాలని, అర్హత పొందిన వారికి నియామక ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ఖాళీ పోస్టుల్లో అడహక్ ప్రమోషన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశా రు. డీహెచ్, డీఎంఈ, టీవీవీపీ పరిధిలో పనిచేస్తున్న ఫార్మసీ ఆఫీసర్లను జిల్లాల్లోని సెంటర్ మెడిసిన్ స్టోర్లలో డిప్యూటేషన్‌పై పనిచేయించడంతో ఒత్తిడి పెరుగుతున్నదని పేర్కొన్నారు. పల్లె, బస్తీ దవాఖానాల్లో ఫార్మసీ పోస్టులు భర్తీ చేయాలని విన్నవించారు.