Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Siddipet | సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలో ఓ గంజాయి బ్యాచ్ కీచక పర్వం ఘటన వెలుగు చూడడం కలకలం సృష్టించింది. బీసీ బాలికపై 8 నెలలుగా గంజాయి బ్యాచ్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన చర్చనీయాంశంగా మారింది.
Siddipet | చేర్యాల / మద్దూరు (ధూళిమిట్ట), అక్టోబర్ 23 : సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలో ఓ గంజాయి బ్యాచ్ కీచక పర్వం ఘటన వెలుగు చూడడం కలకలం సృష్టించింది. బీసీ బాలికపై 8 నెలలుగా గంజాయి బ్యాచ్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన చర్చనీయాంశంగా మారింది. దసరా పండుగ రోజు జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి, సదరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ఈనెల 22న బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలిక వాంగ్మూలం రికార్డు చేశారు. ఏడుగురి నిందితుల్లో ముగ్గురు మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు. శుక్ర వారం గ్రామాన్ని హుస్నాబాద్ ఏసీపీ సదా నందం సందర్శించి బాధిత బాలికతో పాటు తల్లిదండ్రులతో మాట్లాడి భరోసానిచ్చారు. యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి జుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు చేర్యాల సీఐ రమేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో బాధితురాలు మైనర్ కావడంతో వివరాలు గోప్యంగా ఉంచుతున్న ట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో హుస్నా బాద్ ఏసీపీ పర్యవేక్షణలో రాపిడ్ కిట్ల సహా యంతో డ్రగ్స్ టెస్ట్‌లు చేయగా, నిందితులు డ్రగ్స్ సేవించినట్లు తేలలేదని వివరించారు.
జరిగింది ఇది…
విశ్వసనీయ వ్యక్తుల సమాచారం మేరకు.. సిద్ది పేట జిల్లా ధూళిమిట్ట మండలంలో కొంతకా లంగా పలువురు డ్రగ్స్, గంజాయి వంటి మా దక ద్రవ్యాలకు అలవాటుపడి బాలికలు, అమ్మాయిలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తు న్నాయి. ఈ క్రమంలో దూళిమిట్ట మండలానికి చెందిన ఏడుగురు యువకులు దసరా పండుగ రోజు బైక్‌లపై ఓ గ్రామానికి వెళ్లి, అక్కడ ఓ బాలికను వెంట తీసుకెళ్లి ఆమెకు డ్రగ్స్ ఇచ్చి సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈనెల 21న తెల్లవారుజామున బాలికను ఆమె ఇంటి వద్ద వదిలి వెళ్లారు. బాలి కపై గత ఫిబ్రవరి నెల నుంచి నిందితులు లైం గిక దాడులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. బాలికకు సంబంధించిన ఫొటోలు, వీడియో లు తీసి నిందితులు ఈ అఘాయిత్యాలకు ఒడి గట్టుతున్నట్లు సమాచారం. దీనిపై సదరు బాలి కను తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించడంతో జరి గిన విషయమంతా చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు నిందితుల గ్రామానికి వెళ్లి గ్రామంలోని గ్రామ ప్రజాప్రతినిధిని కలిసి జరి గినదంతా చెప్పి న్యాయం చేయాలని కోరారు. ఈ సంగతి పోలీసులకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు.
ప్రచార ఆర్భాటమే తప్ప కరువైన పోలీసులు నిఘా
విద్యాసంస్థలు, పనిచేసే ప్రదేశాలు, బహి రంగ ప్రదేశాల్లో విద్యార్థులు, యువతులు, మహిళలు జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి వేధింపులు ఉన్నా తమకు సమాచారం. ఇవ్వాలని, మీరు ఇచ్చిన సమాచారం గోప్యంగా ఉంచుతామని కొంతకాలంగా పోలీసు అధికారులు, సిబ్బంది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణలో పోలీస్ శాఖ పెద్దగా పట్టిం చుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నిత్యం ఒక్కో బైక్ పై ముగ్గురు, నలుగురు యువకులు ఎక్కి రయ్ రయ్ అం టూ 100 కిలోమీటర్ల స్పీడ్‌లో చేర్యాల పట్టణం, కొమురవెల్లి,మద్దూరు, ధూళిమిట్ట మండల కేంద్రాలు, గ్రామాల్లో దూసుకుపోతున్నారు. అయినా, వారిని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమ ర్శలు ఉన్నాయి. మత్తు పదార్థాల వాడకంపై కఠినంగా వ్యవహరించడం లేదనే విమ ర్శలు ఉన్నాయి. దీంతో యువత మత్తుకు అలవాటు పడి విచ్చలవిడిగా వ్యవహరిస్తు న్నారు. కొందరు యువత మత్తులో ఉన్మా దానికి పాల్పడుతున్నారు. వెలుగుచూస్తున్న సంఘటనలు వాటిని నిజం చేస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

