రేషన్ దుకాణాల పేరెత్తితో జనం విసిగిపోతున్నారు. సన్న బియ్యం కోసం గంటల తరబడి నిలబెడుతున్నారని మండిపడుతున్నారు. తెల్లవారగానే.. సంచులు పట్టుకుని బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొన్నదని భగ్గుమంటున్నారు. పనులు మానుకుని బియ్యం కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు వచ్చాయని అసహనం వ్యక్తంచేస్తున్నారు. సాధారణంగా రేషన్ దుకాణాల వద్ద బియ్యం తీసుకునేందుకు అరగంట వరకు పట్టేదని, ఇప్పుడు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తున్నదని ఆగ్రహంగా చెప్తున్నారు.
ఒక్కో నెల బియ్యం కోసం రెండేసి సార్లు వేలిముద్ర (థంబ్) వేయాల్సి వస్తున్నదని, మొత్తం మూడు నెలల బియ్యానికి ఆరుసార్లు థంబ్ పెట్టాల్సి వస్తున్నదని విసుగు చెందుతున్నారు. లైన్లో తమవంతు వచ్చాక తక్కువలో తక్కువ అరగంట సమయం తీసుకుంటున్నదని చెప్తున్నారు. సర్వర్ సరిగా పనిచేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అన్నీ కలిపి ఒకే స్లిప్పుగా ఇస్తే కొంచెమైనా ఇబ్బందులు తగ్గుతాయని అంటున్నారు.
కొత్త కష్టాలు..
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఇస్తుండటం లబ్ధిదారులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. గత నెల వరకు రేషన్ కోసం వెళ్తే.. బయట లైన్లో 15 నిమిషాలు నిలబడితే సరిపోయేది. నేరుగా సర్వర్ చెంతకు వచ్చేవారు. అక్కడ సర్వర్ మెషిన్లో ఒకసారి వేలిముద్రలు పెట్టి.. వచ్చే కోటా బియ్యాన్ని అదే సమయంలో తూకం చేసి ఇచ్చేసేవారు.
మూడునెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కో నెల కోటా బియ్యానికి ఒక్కోసారి తూకం వేయాల్సి వస్తున్నది. ఒక్కోనెల బియ్యంలోనూ కేంద్రం ఇచ్చే బియ్యానికి ఒకసారి, రాష్ట్ర కోటా బియ్యానికి మరోసారి వేలి ముద్ర వేయిస్తున్నారు. ఇలా మూడునెలలకు కలిపి ఆరుసార్లు వేలిముద్రలు వేస్తున్నారు. ఆయా కోటాల ప్రకారం ఆరుసార్లు బియ్యం తూకం చేస్తున్నారు.
ఇది లబ్ధిదారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నది. ఒకేసారి మూడునెలల బియ్యం ఇస్తుండటంతో జనం రద్దీ పెరిగింది. రేషన్ దుకాణాల వద్ద బారులు పెరిగాయి. బయటే గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
6. పొద్దున్నే లైన్లో 40 మంది నిలబడితే 25 మంది కోటా పూర్తయ్యేసరికే సమయం గడిచిపోతున్నది. సాయంత్రం మళ్లీ కొత్తగా మొదటి నుంచి లైన్లో వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇంట్లో ఇద్దరు వ్యక్తులున్న రేషన్కార్డుదారుకు నెలకు (ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున) 12 కిలోల బియ్యం వస్తాయి.
ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వాలంటే ఇద్దరున్న రేషన్కార్డుదారుకు ఒకేసారి 36 కిలోల బియ్యం వస్తున్నాయి.ఇందులో 10 కిలోల ఇస్తుండగా, రాష్ట్రం 2 కిలోల అందిస్తున్నది.
ఇంతవరకు బాగానే ఉన్నా.. రేషన్ బియ్యం పంపిణీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉన్నది. మూడు నెలలకు కలిపి 36 కిలోల బియ్యంలో కేంద్రం 30 కిలోలు, రాష్ట్రం 6 కిలోలు ఇస్తున్నది.
సికింద్రాబాద్ మరియు కంటోన్మెంట్ ప్రాంతాల లోని రేషన్ దుకాణాల వద్ద పరిస్థితి
శంకర్ పల్లి లో కొన్ని డీలర్ షాపులు ఓపెన్ చెయ్యలేదు బియ్యం కోసం వచ్చిన ప్రజలు సంచులను క్యూ లైన్ లో పెట్టిన దృశ్యం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా .. జిల్లా కేంద్రంలో L B నగర్ రేషన్ డీలర్ షాప్ వద్ద పరిస్థితి