హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ) : మంచు కుటుంబంలో విభేదాలు తారస్థాయి చేరుకున్నాయి. తన కొడుకు, కోడలు నుంచి ప్రాణహాని ఉందంటూ మోహన్‌బాబు రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే తన తండ్రి అనుచరుల నుంచి తన కు ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ పహాడీ షరీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్తుల విషయంలో ఏర్పడ్డ విభేదాలతోనే గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తున్న ది. జల్పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద మోహన్‌బాబు, మనోజ్ తరఫున మో హరించిన అనుచరులు, బౌన్సర్ల వీడియో లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కుటుంబ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మోహన్‌బాబు మాదాపూర్‌లో తెలిసిన వ్యక్తి వద్ద పరిష్కరించుకుంటున్నారని ప్రచారం జరిగింది. మోహన్‌బాబు కుమా ర్తె మంచు లక్ష్మి కూడా జల్పల్లిలోని ఇంటి కి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడి వెళ్లారు. సోమవారం సాయంత్రం మోహన్‌బాబు కుమారుడు మనోజ్, కోడలు మౌనికపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదిరినట్టు స్పష్టమైంది.
రంగారెడ్డి జిల్లా జల్పల్లిలోని మంచుటౌన్ షిప్లో తాను పదేండ్లుగా నివాసముంటున్నాని మోహన్‌బాబు తన ఫిర్యాదులో తెలిపారు. తన చిన్న కొడుకు మనో జ్, కోడలు మౌనిక అనుచరులతో వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వెల్లడించారు. తన 7 నెలల కూతురిని వదిలేసి మ నోజ్ అతని భార్య బయటకు వెళ్లిపోతార ని, ఆ పాపను ఇంట్లో పనిచేసే మహిళనే సంరక్షకురాలిగా ఉంటుందని వెల్లడించా రు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో మనోజ్, 30 మంది అనుచరులు దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడ్డారని, ఇం ట్లో ఉన్నవారిని బెదిరించి ఇల్లు ఖాళీ చే యాలంటూ భయపెట్టారని పేర్కొన్నారు. తన ఆస్తులను కాజేసేందు కు మనోజ్ కుట్ర చేస్తున్నారని, తనకు ప్రా ణహాని ఉందని, తనకు, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు.
ఈ నెల 8వ తేదీన ఉదయం సమయం లో గుర్తుతెలియని పది మంది వ్యక్తులు తన ఇంట్లోకి ప్రవేశించి అరుపులు, కేకలు వేశారని, అడ్డుకోబోయిన తనపై దాడి చేసి పరారయ్యారంటూ మనోజ్ సోమవారం పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశా డు. దవాఖానలో చికిత్స చేయించుకున్నా నని, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.