న్యూఢిల్లీ, జూన్ 15: స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి బుధవారం రాత్రి 7.30 గంటలకు దీన్ని పరీక్షించినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. నిర్దేశిత లక్ష్యాన్ని క్షిపణి అత్యంత కచ్చితత్వంలో ఛేదించినట్టు వెల్లడించారు. దేశీయంగా తయారుచేసిన పృథ్వీ 2 క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.