న్యూఢిల్లీ: జమ్ము కశ్మీరుతోసహా వివిధ రాష్ర్టాలకు గవర్నర్‌గా పనిచేసిన సీనియర్ రాజకీయ నాయకుడు సత్యపాల్ మాలిక్ (79) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. 2019లో కేంద్రం జమ్ము కశ్మీరుకు ప్రత్యేక హోదాను రద్దు చేసి రాష్ర్టాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించినపుడు ఆయన ఆ రాష్ర్టానికి గవర్నర్‌గా ఉన్నారు. ఆయన గవర్నర్‌గా ఉన్న కాలంలోనే పుల్వామా ఉగ్ర దాడి జరిగి 40 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన మోదీ ప్రభుత్వంపై చేసిన తీవ్ర ఆరోపణలు సంచలనంగా మారాయి. 2021-21 కాలంలో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిర్వహించిన ఆందోళనకు ఆయన మద్దతు పలకడంతో మాలిక్‌కు, మోదీ ప్రభుత్వానికి మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి.