 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : నకిలీ ఓఆర్ఎస్పై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సీనియర్ పీడియాట్రీషియన్ డాక్టర్ శివరంజిని సంతోష్ పిలుపునిచ్చారు. గురువారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) జైపూర్‌లోని మెడికల్ షాపుల్లో సోదాలు చేసి ఓఆర్ఎస్ పేరిట బ్రాండ్ల అమ్మకాలను సీజ్ చేసినట్టు తెలిపారు.
రాష్ట్రంలో సైతం ఇప్పటికే నిల్వ ఉంచిన నకిలీ ఓఆర్ఎస్ స్టాక్‌ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామం, పట్టణాల్లో తల్లిదండ్రులు ఓఆర్ఎస్ టెట్రా ప్యాకెట్ల అమ్మకాలపై నిఘా పెట్టాలని కోరారు. తమ పిల్లల ఆరోగ్యంతో ఇన్ని రోజులు ఆటలాడిన కంపెనీలపై మరింత కఠినంగా వ్యవహరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తల్లిదండ్రులను కోరారు.
 
                            