Gone Prakash | హైదరాబాద్ : ఓ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సీనియర్ నేత గోనె ప్రకాశ్ సంచలన ఆరోపణలు చేశారు. కొబ్బరికాయలు కొట్టే రూ. 10 లక్షల కాంట్రాక్టులో కూడా 2 శాతం కమీషన్ అడుగుతున్నాడు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే అని ఆయన పేర్కొన్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోనె ప్రకాశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
1972 నుండి రాజకీయాలను చూస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి ఏ ప్రభుత్వంలో చూడలేదు.. ఏ రాష్ట్రంలో కూడా ఇంత అవినీతి ఉండకపోవచ్చు. ఒక నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల్లో రూ. 35 కోట్లు ఖర్చు పెట్టానని చెబుతున్నాడు. ఇప్పుడు ఆ డబ్బును సంపాదించేందుకు కొబ్బరికాయలు కొట్టే రూ.10 లక్షల కాంట్రాక్టులో కూడా 2 శాతం కమీషన్ అడుగుతున్నాడు. ఆ ఎమ్మెల్యే వేల కోట్ల ఆస్తి కలిగి ఉన్న ధనవంతుడు. ఇక మళ్లీ బిల్లులకు కమిషన్లు అడుగుతున్నాడు. భట్టి విక్రమార్క దగ్గర బిల్లు శాంక్షన్ చేయిస్తాను, కానీ నాకు 10 శాతం వాటా కావాలని బహిరంగంగా అడుగుతున్నారు. ఆయనకున్న ప్రాపర్టీ లెక్కపెడితే వందలు కాదు వేల కోట్ల సంపద ఉంది. వందల ఎకరాల భూమి ఉంది. కాంగ్రెస్ పార్టీని కొందరు భ్రష్టు పట్టిస్తున్నారు. ఇసుక, మట్టి దందా చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు అని గోనె ప్రకాశ్ సంచలన ఆరోపణలు చేశారు.
1972 నుండి రాజకీయాలను చూస్తున్నాను
కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి ఏ ప్రభుత్వంలో చూడలేదు
ఒక నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, కొబ్బరికాయలు కొట్టే రూ.10 లక్షల కాంట్రాక్టులో కూడా 2% కమీషన్ అడుగుతున్నాడు
ఆ ఎమ్మెల్యే వేల కోట్ల ఆస్తి కలిగి ఉన్న ధనవంతుడు… pic.twitter.com/UZZzSX2Lj0
— Telugu Scribe (@TeluguScribe) November 6, 2025