ఖైరతాబాద్, ఏప్రిల్ 9: గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ కులాలకు కేటాయించిన భూ ములను కార్పొరేట్ సంస్థలు కాజేయాలని కుట్రలు చేస్తున్నాయని, కుల సంఘాలు అప్రమత్తంగా ఉండి వాటిని రక్షించుకోవాలని వక్త లు పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలోనూ పక్క రాష్ట్రం పెత్తనం సాగుతున్నదని, ఏపీకి చెందిన ఓ మంత్రి తమ కళాశాలల కోసం బీసీలకు కేటాయించిన ఆత్మగౌరవ భవనాల స్థలాలను చెరబట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
రేవంత్ మాటిమాటికి చంద్రబాబు శిష్యుడని చె ప్పుకొంటూ.. ఇక్కడ బాబు పాలన సాగించాలని చూస్తున్నాడని విమర్శించారు. ముదిరాజ్ సంఘం నాయకుడు డాక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ప్రభు త్వం కుల సంఘాల భూములను కాజేసేందుకు కులాల మధ్య చిచ్చు పెడుతున్నదని ఆరోపించారు. సినీ దర్శకుడు, సామాజిక కార్యకర్త సయ్యద్ రఫీ మాట్లాడుతూ.. ప్రస్తు తం ట్రస్ట్‌ల పేరుతో కొందరు అక్రమాలకు శ్రీకారం చుట్టారని, ఆ భూములను దుర్వినియోగం చేసే ప్రక్రియ ప్రారంభించారని మం డిపడ్డారు.
కోకాపేటలోని కురుమ సంఘానికి కేటాయించిన భూముల్లో భవన నిర్మాణం కూడా జరిగిందని, దానిని అడ్డుకోకుంటే ఆ భూములను కోల్పోతామని ఆందోళన వ్యక్తంచేశారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది శారద గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వంలోని కొందరు పెద్దలతో ఒప్పందం కుదుర్చుకొని భూములను ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో పోల్కం లక్ష్మీనారాయణ ముదిరాజ్, సురేశ్ ముదిరాజ్, ప్రభాకర్, చంద్రమౌళి పాల్గొన్నారు.