హైదరాబాద్, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే నారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ర్టాల ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని పేరొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆంధ్రా ప్రాంతంలోని భీమవరానికి చెందిన వారికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పవన్‌కల్యాణ్ తొలి రోజుల్లో చేగువేరా ఆదర్శమని, ఇప్పుడు సనాతన ధర్మ ం అంటున్నారని విమర్శించారు. సనాతన ధర్మం కోసం తిరగాలి అనుకుంటే రాజకీయాల్లో ఉండకుండా ఆ పని చేసుకోవచ్చని హితవు పలికారు. సనాతనవాదికి రాజకీయాల్లో ఉండే అర్హతలేదని చెప్పారు.